Friday, 5 December 2008
అమ్మంటే దేవత, అమ్మంటే అమృతమూర్తి అంటూ కవిత్వాలు ఒలకబోస్తాం కదా!
కళ్ళలోంచి ఆగకుండా కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి. ఎన్నడూ ఎరగని ఓ భయం నన్ను ఆవహించింది. గుండె రగులుతున్న కొలిమిలా వుంది. రాత్రంతా నిద్రలేక కళ్ళు ఎర్రబడి మండుతున్నాయి. కళ్ళు మూసిన కాసేపటిలోను పీడకలలు. విధ్వంశ దృశ్యాలు. గాజు కళ్ళ తల్లులు బారులు కట్టి కన్నీరు మున్నీరవుతున్న విషాద దృశ్యాలు. ఎటుపోతున్నాం? మనమేం చేస్తున్నాం? మానవ సంబంధాలెందుకింతగా దిగజారిపోతున్నాయి? మనుష్యులుగా కాక మర బొమ్మల్లా ఎందుకు తయరవుతున్నాం? మార్కెట్‌ను ముంచెత్తుతున్న వస్తు సముదాయం ముందు మమతలు, మానవీయతలెందుకు వంగి వంగి సలామ్‌లు చేస్తున్నాయి? నా ఈ ఆవేదనకి, అంతరంగ సంఘర్షణకి కారణాలు మీతో పంచుకుంటేనే గానీ నా గుండె భారం తగ్గేట్టు లేదు.ఇంతకాలం గృహహింస అంటే భార్యల్ని హింసిస్తున్న భర్తల విషయమే ఎక్కువ మాట్లాడుతున్నాం. భార్య భర్తల సంబంధంలోని అసమానత్వం, పురుషాధిక్య భావజాలం మహిళల ముఖ్యంగా భార్యల జీవితాలను ఎంత సంక్షోభమయంగా చేస్తున్నాయె మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వందల సంఖ్యలో స్త్రీలు గృహహింసకు బలవుతున్నారు. ఈ హింసకు చాలా వరకు కారణాలు కూడా మనకు తెలుసు. నిరక్షరాస్యత, ఆర్ధిక పరాధీనత, పితృస్వామ్య భావజాలంతో పాటు మార్కెట్ ఎకానమీ - వస్తు వినిమయ సంస్కృతి కూడా చాలావరకు కారణాలే. హింసిస్త్ను భర్తను తిరిగి తన్నగల సత్తా వున్న మహిళ కూడా పురుషాధిక్య భావజాలం నరనరాన నూరిపోయడంవల్ల నిస్సహాయంగా హింసని భరిస్తంటుంది. కిరోసిన్ పోసి నిప్పంటిస్తున్నా తిరగబడక మౌనంగా ప్రాణాలు విడుస్తుంది. ప్రాణం గాల్లో కలిసిపోతున్నా తిరగబడనీయకుండా అణిచివుంచుతున్న పురుషాధిక్య భావజాలం ఎంతగా మనలో ఇంకిపోయి వుందో, దీన్ని వొదిలించుకోవాలంటే ఎంత పోరాటం చెయ్యలో, స్త్రీల ఉద్యమం ఈ దిశగా ఎంత కృషి చెయ్యలో స్పష్టంగా అర్ధమవుతోంది.అయితే కుటుంబ హింసకి గురవుతున్న భార్యల సరసన తల్లులు కూడా చేరడం నాకు తీవ్ర దు:ఖాన్ని కలిగిస్తోంది. జన్మనిచ్చిన తల్లిని, లాలిపాడి నిద్రపుచ్చిన తల్లిని, రక్తాన్ని పంచిచ్చి, గోరు ముద్దలు తినిపించిన, తల్లిని హింసించే కొడుకుల క్రూరత్వం నన్ను వణికిస్తోందిఓ తల్లికి ఎనభై సంవత్సరాలు. ఈ వయస్సులో కూడా కొడుక్కి వొండి పెట్టలి. వాడికి నచ్చినట్లు వొండాలి. లేకపోతే కొడతాడు. కంచాలు విసిరేస్తాడు. ఇల్లు పీకి పందిరేసినట్టు రెచ్చిపోయి నోటికొచ్చిన తిట్లతో హింసిస్తాడు. వాడు సాదాసీదావాడు కాదు. కవిత్వాలు రాస్తాడు. నాటకాలేస్తాడు. మాతృత్వం మీద కవితలు రాసి బహుమతులు కొట్టేస్తాడు. ఇంటికొచ్చి ముసలితల్లిని కొడతాడు.ఇంకొక కొడుకు తల్లిని చంపేస్తానని బెదిరిస్తాడు. ఉద్యోగ విరమణ చేయగానే వచ్చే డబ్బంతా తనకివ్వకపోతే చంపేస్తానని రోజూ బెదిరిస్తాడు. ఆ డబ్బుతో కారు కొనుక్కోవాలని ఆ కొడుకు దురాశ. నువ్వు చచ్చిపోతే నాకు ఉద్యోగం వస్తుంది. ఇంకా బతికి ఎవరిని ఉద్దరించాలి. గవర్నమెంటు ఉద్యోగం రావాలంటే కష్టం. నువ్వు చస్తే నీ ఉద్యోగం నాకొస్తుంది కదా! కన్న కొడుకు కోసం ఆ మాత్రం త్యాగం చెయ్యలేవా అంటూ రోజూ ఎమొషనల్ బ్లాక్మెయిల్ చేసే కొడుకు. ఎన్నని రాయను. ఎన్ని గుండె ఘోషల్ని మీకు వినిపించను. మాతృదేవోభవ అని మనం గప్పాలు కొట్టుకుంటాం కదా! అమ్మంటే దేవత, అమ్మంటే అమృతమూర్తి అంటూ కవిత్వాలు ఒలకబోస్తాం కదా! వాస్తవంలో జరుగుతున్నదేమిటి? వస్తు సముదాయం ముందు ప్రాణం గడ్డి పరకేనా? డబ్బు , బంగారం, ఆస్తులు, కార్లు, బంగళాలతో పాటు గజ్జి కురుపుల్లా పుట్టుకొచ్చిన మహా్మాల్స్లోని మహా చెత్త ముందు మనిషి ప్రాణం చవకేనా? ఎనభై ఏళ్ళ పండు ముసలి తల్లి మీద చేతులెత్తే ఈ భయానక సంస్కృతికి ము౦దెక్కడుంది? కళ్ళని జిగేల్ మన్పిస్తున్న కార్పోరేట్ క్రూరత్వాన్ని అడ్డుకునేదెలా? కుప్పకూలుతున్న మానవ సంబంధాల విధ్వంశ దృశ్యం మనలో మంటల్ని సృష్టించకపోతే మనమూ అందులో భాగస్వామ్యులమయ్యే ప్రమాదం మరెంతో దూరంలో లేదు.ప్లీజ్ ఆలోచించండి మనం ఎవరం ఎల్లా వచ్చాం ,ఎల్లా వుంట్టున్నం ,ఎటు వెళ్తున్నాం ,మన గమ్యం ఏమిటి ప్లేస్.................
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment